చిన్నకడై వీధికి చెందిన అల్‌అమీన్, పత్తూన్ నిషాల కూతురు హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో నీట్ పరీక్ష రాసింది. ఆ అమ్మాయికి తక్కువ మార్కులు రావడంతో సీటు కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇటీవల పత్తూన్ నిషా కడై ప్రాంతంలోని ఒక ప్రైవేట్ ట్రావెల్స్‌లో తన కూతురి కోసం టిక్కెట్ కొనడానికి వెళ్లింది. అక్కడ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తితో తన కూతురి మెడికల్ సీటు గురించి ప్రయత్నిస్తున్నా అని చెప్పింది పత్తూన్. అయితే తాను రాఘవ లారెన్స్ నిర్వహిస్తున్న ట్రస్ట్‌కు ఉపాధ్యక్షుడినని, లారెన్స్ ట్రస్ట్ ద్వారా వూలూర్‌లోని వైద్య కళాశాలలో తక్కువ ఖర్చుతో సీటు ఇప్పిస్తానని, అందుకు కొంత ఖర్చు అవుతుందని నమ్మబలికాడు. ప్రవీణ్ కుమార్ మాటలు నమ్మిన పత్తూర్ నిషా ఆయన చెప్పినట్టుగా మొదట రూ.4.5 లక్షలని ఆయన బ్యాంక్ ఎకౌంట్‌కి పంపింది. ఆ తర్వాత మిగతా ఖర్చుల కోసం కొంత మొత్తం పంపాలని కోరాడు. ఇలా మొత్తంగా రూ.18 లక్షలు ప్రవీణ్ కుమార్ ఎకౌంట్‌కి పంపింది పత్తూర్. అయితే ప్రవీణ్ నుండి ఎలాంటి స్పందన రాకపోతుండడంతో ఒక రోజు అనుమానం వచ్చి లారెన్స్ ట్రస్ట్‌కి ఫోన్ చేయడంతో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరు ఇక్కడ లేరని వారు స్పష్టం చేశారు. దీంతో తాను మోసపోయిన వియాన్ని గ్రహించి పత్తూర్ నిషా తన భర్తతో కలిసి రామనాథపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఓం ప్రకాశ్ మీనాక్షిని కలిసి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రవీణ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.