telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బన్నీ వల్ల సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న సాయి ధరమ్ తేజ్ ?

PP

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, అందాల భామ రాఖి ఖ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో మారుతి తెర‌కెక్కించిన చిత్రం “ప్రతి రోజు పండగే”. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. డిసెంబ‌ర్ 20న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌మోష‌న్‌లో భాగంగా చిత్రానికి సంబంధించిన సాంగ్స్ ఒక్కొక్కటిగా విడుద‌ల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కు, టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమాను ఇప్పుడు కాకుండా సంక్రాంతికి విడుదల చేస్తే బాగుండేదని ట్రైలర్ చూసిన వారిలో చాలా మంది అనుకుంటున్నారు. నిజానికి ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారట. `శతమానంభవతి` తరహాలో కుటుంబ కథా చిత్రం కావడంతో సంక్రాంతికి వస్తే ఆదరణ బాగుంటుందని అనుకున్నారట. అయితే సంక్రాంతికి అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో..` సినిమా విడుదలవుతోంది. దానితో అనవసర పోటీ ఎందుకని ఈ సినిమాను ముందుగానే విడుదల చేసేస్తున్నారట. రెండు సినిమాలకూ అల్లు అరవిందే నిర్మాత. కాబట్టి ఆయన పోటీ లేకుండా ఉంటే బాగుంటుందని అనుకున్నారట. బన్నీ సినిమా లేకపోతే `ప్రతిరోజూ పండగే` సినిమా సంక్రాంతికే వచ్చి ఉండేదేమో. అయితే సంక్రాంతికి కూడా పోటీ గట్టిగానే ఉంది.

Related posts