భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మెదడులో రక్తం గడ్డకట్టడంతో కోమాలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా వైరస్ కూడా సోకడంతో ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆసుపత్రి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తాజాగా ప్రణబ్ ఆరోగ్యంపై బులెటిన్ విడుదల చేశారు. ఆయన ఇంకా కోమాలోనే ఉన్నారని వెల్లడించారు.
అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగవుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్మీ వైద్యులు తెలిపారు. పల్స్ రేటు, రక్త ప్రసరణలో ఎలాంటి హెచ్చుతగ్గులు లేవని తెలిపారు. కీలక ఆరోగ్య సూచీలు నిలకడగా ఉన్నాయని వివరించారు. పైగా కిడ్నీల పనితీరు కూడా కొద్దిమేర మెరుగైందని పేర్కొన్నారు. ఆయన వెంటిలేటర్ పై ఉన్నారని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని ఆ బులెటిన్ లో తెలిపారు.
కేసీఆర్ ఎవరిని కలవడానికి ఢిల్లీకి వస్తున్నారు: బీజేపీ ఎంపీ సంజయ్