ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ ని ప్రకాష్ రాజ్ ఈరోజు కలిశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని, లోక్ సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని దక్షిణాది నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవలప్రకటించారు. ప్రకాష్ రాజ్ ప్రకటన వెలువడ్డ అనంతరం, ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆద్మీ పార్టీ  ప్రకటించిన విషయం తెలిసిందే. 
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తో ప్రకాష్ రాజ్ ఢిల్లీలో  భేటీ అయ్యారు.  తన రాజకీయ ప్రయాణానికి మద్దతు ప్రకటించిన కేజ్రీవాల్ కు ధన్యవాదాలు తెలియజేశానని పేర్కొన్నారు. పలు అంశాలకు సంబంధించిన సమస్యలపై తన బృందం రూపొందించిన వాటిపై చర్చించామని, వాటి పరిష్కారానికి వివిధ మార్గాలను పంచుకోవాలని కోరినట్టు ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.



కర్ణాటక, గోవా రాజకీయ సంక్షోభంపై చిదంబరం స్పందన