telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కూల్చి వేసిన ప్రజావేదికను పరిశీలించిన చంద్రబాబు

tdp chandrababu

ఏపీ రాజధాని అమరావతిలో మాజీ సీఎం చంద్రబాబు ఈ ఉదయం టీడీపీ నేతలతో కలిసి పర్యటిస్తున్నారు. తొలుత కూల్చివేసిన ఉండవల్లి ప్రజావేదికను ఆయన పరిశీలించారు. చుట్టూ తిరిగిన చంద్రబాబు, ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఆపై ఏమీ మాట్లాడకుండానే, తన కాన్వాయ్ లో వెంకటపాలెం మీదుగా చంద్రబాబు ఉద్దండరాయపాలెం చేరుకోనున్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. గృహ సముదాయాల నిర్మాణాలను చంద్రబాబు పరిశీలించనున్నారు.

చంద్రబాబు పర్యటన సందర్భంగా రాజధాని ప్రాంత రైతులు రెండు గ్రూపులుగా విడిపోవడంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. చంద్రబాబు పర్యటనకు నిరసనగా నల్లజెండాలు, ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయగా, వాటిని దగ్గరుండి పోలీసులు కట్టించారని టీడీపీ నేతలు అంటున్నారు.

Related posts