telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమరావతి : … 15న పొట్టి శ్రీరాములు వర్ధంతి .. రాష్ట్రమంతా ప్రత్యేక కార్యక్రమాలు..

ap logo

ఉమ్మడి ఏపీ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని 15న రాష్ట్రమంతటా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రోటోకాల్ విభాగం ఆదేశాలు జారీచేసింది.

డిసెంబరు 15 ఆదివారం సెలవురోజు కావడంతో రాష్ట్ర, జిల్లా స్థాయిలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా కలెక్టర్లకు ముందస్తుగా ఆదేశాలు జారీ చేసింది.

Related posts