రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం `రాధే శ్యామ్`. ఈ చిత్రానికి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ తరువాత అక్టోబర్‌లో ఇటలీ షెడ్యూల్‌ను ప్రారంభించింది చిత్ర యూనిట్. సుమారు నెల రోజులపాటు అక్కడ షూటింగ్‌లో పాల్గొన్న పూజా తన భాగం చిత్రీకరణను పూర్తిచేసుకున్నారు. మంగళవారం ఆమె హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. తాను ఇటలీ షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్నట్టు పూజ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలిపింది. `రాధే శ్యామ్ ఇటాలియన్ షెడ్యూల్‌ను పూర్తిచేశాను. ఈ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసిన టీమ్‌కు ధన్యవాదాలు. హైదరాబాద్‌లో కలుద్దాం ప్రభాస్` అని పూజ పేర్కొంది. ఇటలీ షెడ్యూల్‌ను పూజా హెగ్డే చాలా ఎంజాయ్ చేసినట్టు తెలిపింది. ఆమె పుట్టినరోజును కూడా అక్కడే జరుపుకున్నారు. అంతేకాదు, పూజా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ప్రేరణ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఏకంగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే రొమాన్స్ చేయనున్నాడు ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం. ఆ తర్వాత ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడి తో ‘ఆదిపురుష్’ అనే సినిమా చేస్తున్నాడు.
previous post
next post
ఆ సినిమా కథ విని దర్శకుడిని తిట్టేశా.. : సంగీత