ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలంలో భారీగా మందుగుండు సామాగ్రితో పాటు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. బీజాపూర్ జిల్లాలోని బైరాంఘడ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోంది. పోలీసులకు, మావోలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పది మంది మావోయిస్టులను కాల్చిచంపాయి.
ఈ విషయమై జిల్లా ఎస్పీ మోహిత్ గార్గ్ మాట్లాడుతూ.. బైరాన్ ఘడ్ ప్రాంతంలో ఈరోజు ఎస్టీఎఫ్, డీఆర్జీ సంయుక్త బలగాలు కూంబింగ్ చేపట్టాయని తెలిపారు. ఇంతలోనే మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాల తరఫున ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు. ఘటనాస్థలం నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపును ముమ్మరం చేశామన్నారు.

