ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్ గా వ్యవహరిస్తున్న వెంకటేశ్వరరావును తొలగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సభ్యుడి పదవి నుంచి ఆయన్ని తొలగించారు.
వెంకటేశ్వరరావు స్థానంలో పీపీఏ సభ్యుడిగా సీఈ సుధాకర్ బాబును నియమించినట్టు సమాచారం. ఇకపై రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా వెంకటేశ్వరరావు కొనసాగనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.


అమిత్ షా సంచలన ప్రకటన ..