telugu navyamedia
వ్యాపార వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

గత కొద్ది రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు అన్ని జిల్లాల్లో పెట్రోల్ సెంచరీ కొట్టి ముందుకు వెళ్తోంది. రోజు రోజు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వాహనం నడపాలంటేనే వణికిపోతున్నారు. సెంచరీ దాటిన పెట్రోల్ ధరను చూసి పొదుపుగా వాహన ప్రయాణాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

అయితే అధికారిక సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్ రేట్లలో కూడా బుధవారం ఎలాంటి మార్పు లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ..

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్​ రూ.105.46 వద్ద స్థిరంగా ఉంది. లీటర్ డీజిల్​ ధర రూ.97.7గా కొనసాగుతోంది.

కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.35గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.97.61గా ఉంది.

ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 105.39గా ఉండగా.. డీజిల్ ధర రూ. 97.64గా ఉంది.

మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.22గా ఉండగా.. డీజిల్ ధర రూ.98.43గా ఉంది.

రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.02 ఉండగా.. డీజిల్ ధర రూ.98.24గా ఉంది.

వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.02 పలుకుతుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.30గా ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు .. 

వైజాగ్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.42గా, లీటర్​ డీజిల్​ ధర రూ.98.51 వద్ద ఉన్నాయి.

గుంటూరులో పెట్రోల్ లీటర్​ ధర రూ.107.69గా ఉంది. డీజిల్​ లీటర్​ రూ.99.33 వద్ద కొనసాగుతోంది.

విజ‌య‌వాడ‌లో పెట్రోల్ లీటర్​ ధర రూ.107.62గా ఉంది. డీజిల్​ లీటర్​ రూ 99.25 వద్ద కొనసాగుతోంది.

విజయనగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.79గా ఉంది.. డీజిల్ ధర రూ.98.53 వద్ద కొనసాగుతోంది.

Related posts