telugu navyamedia
వ్యాపార వార్తలు

దేశ వ్యాప్తంగా మరోసారి పెరిగిన ముడి చమురు ధరలు..

దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్ పై 25 పైసలు, లీటర్ డీజిల్ పై 30 పైసలు పెరిగింది. అయితే మెట్రో నగరాల్లో కొద్ది రోజులపాటు స్థిరంగా కొనసాగిన ధరలు ఇప్పుడు పంజుకున్నాయి. ఓ వైపు అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరుగుతూ ఉంటే.. ఆ ప్రభావాన్ని వినియోగదార్లపై ప‌డుతుంది.

జులై, ఆగస్టులో పెట్రోల్, డీజిల్ ధరలు హెచ్చు తగ్గులు ఉన్నాయి. అయితే జులై 18 నుంచి సెప్టెంబరు 23 వరకు చమురు మార్కెటింగ్‌ కంపెనీ(ఓఎమ్‌సీ)లు ధరల్లో ఎటువంటి పెంపూ చేయలేదు. అంతే కాదు మొత్తం మీద లీటరు పెట్రోలు రూ.0.65; డీజిల్‌ లీటరు రూ.1.25 చొప్పున తగ్గించారు. అయితే అంతర్జాతీయ చమురు ధరలు ఎంతకీ చల్లారకపోవడంతో ఓఎమ్‌సీలు తమ పెట్రోలు, డీజిల్‌ రిటైల్‌ ధరలను వరుసగా సెప్టెంబరు 28, సెప్టెంబరు 24 నుంచి అమల్లోకి వచ్చేలా పెంచడం మొదలు పెట్టాయని ఆ అధికారి వివరించారు. సోమవారం (అక్టోబరు 04) ఎటువంటి మార్పులు చేయనప్పటికీ.. సెప్టెంబరు 24 నుంచి డీజిల్‌ లీటరు ధర రూ.2.15 వరకు పెరగ్గా.. గత వారం రోజుల్లో పెట్రో లీటరు ధర రూ.1.25 వరకు ప్రియమయ్యాయి.

400 petrol pumps to remain shut today over Delhi govt's refusal to reduce  VAT - The Statesman

పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 102.64/ltr (రూ. 0.25 పెరిగింది), లీటర్ డీజిల్ రూ. 91.07/ltr (రూ. 0.30 పెరిగింది)

ముంబైలో పెట్రోల్ రూ. 108.67 (రూ. 0.24), డీజిల్ రూ .98.80/ltr (రూ. 0.32)

కోల్‌కతాలో పెట్రోల్ రూ. 103.36/ltr (రూ. 0.29), డీజిల్ రూ. 94.17/ltr (Rs. 0.30 పెరిగింది)

చెన్నైలో పెట్రోల్ రూ .100.23/లీటర్ (రూ. 0.22), డీజిల్ రూ. 95.59/లీటర్ (రూ. 0.22)

ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి. మంగళవారం తెలుగు రాష్ట్రాలలో మాత్రం చాలా నగరాల్లో మార్పు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.77గా ఉంది. ఇదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ. 99.37గా ఉంది.

కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.94గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర ధర రూ.99.52గా ఉంది.

విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.107.94 ఉండగా.. డీజిల్ ధర రూ. 100గా ఉంది.

విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.109.26 కు లభిస్తుండగా.. లీటర్ డీజిల్ ధర రూ.101.28 లకు లభిస్తోంది.

గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 109.26 లకు లభిస్తుండగా.. డీజిల్ రూ.101.28లకు లభిస్తోంది.

Related posts