telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పాకిస్తాన్‌లో పెట్రోలు కొరత..బంకుల వద్ద వాహనదారులు బారులు

petrol bunk pakistan

పాకిస్తాన్‌లో గత కొన్ని రోజులుగా పెట్రోలు కొరత ఏర్పడడంతో అక్కడి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పలు పెట్రోలు బంకులు మూతపడటంతో రైతులు పంపు సెట్లు నడపలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం శుక్రవారం అన్ని పెట్రోలియం ఉత్పత్తుల ధరలను అమాంతం పెంచేసింది. పెట్రోల్ ధరలను లీటరుకు రూ.25.58 పెంచారు. దాంతో లీటరు పెట్రోల ధర రూ. 100.10 కు చేరింది.

అదేవిధంగా డీజిల్ లీటరుకు రూ .21 పెరుగడంతో లీటరు డీజిల్‌ ధర రూ. 101.46 కు చేరుకొన్నది. కిరోసిన్ కూడా లీటరుకు రూ .24 ఖర్చు అవుతున్నది. కొత్త ధరలు అమలులోకి వచ్చిన తరువాత దేశంలోని అనేక నగరాల్లో పెట్రోల్ పంపులు మూసివేశారు. దేశంలో చాలా పెట్రోల్ పంపుల వద్ద సాంకేతిక లోపాల బోర్డులు వేలాడదీశారు. మరికొన్ని నోటీసు లేకుండా మూసివేసేశారు. పెట్రోలు బంకులు మూతపడుతుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ కోసం బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు.

Related posts