telugu navyamedia
రాజకీయ వార్తలు

విశాల దృక్పథం, గొప్ప మనసు ఉన్నవారు ఏ విషయంపైనైనా వెంటనే స్పందించరు: మంత్రి రాజ్‌నాథ్ సింగ్

భారత ఎగుమతులపై అమెరికా విధించిన భారీ సుంకాలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందనే ప్రశ్నకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసక్తికరంగా బదులిచ్చారు.

“విశాల దృక్పథం, గొప్ప మనసు ఉన్నవారు ఏ విషయంపైనైనా వెంటనే స్పందించరు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికా చర్యలపై ఇప్పటివరకు నేరుగా స్పందించని భారత ప్రభుత్వం, ఆచితూచి వ్యవహరిస్తోందన్న సంకేతాలను ఆయన తన మాటల ద్వారా పరోక్షంగా వెల్లడించారు.

ప్రస్తుతం మొరాకో పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్ సింగ్, అక్కడి ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా, అమెరికా సుంకాలపై భారత ప్రభుత్వ వైఖరి గురించి ఒకరు ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు.

ప్రభుత్వం ఈ అంశాన్ని గమనిస్తోందని, అయితే తొందరపడి దీనిపై స్పందించబోమని ఆయన స్పష్టం చేశారు.

భారత ఎగుమతులపై ఏకంగా 50 శాతం మేర సుంకాలను విధించింది. ఈ అంశంపై వాణిజ్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ, భారత ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఈ నేపథ్యంలో, ఓ సీనియర్ మంత్రిగా రాజ్‌నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అమెరికా చర్యలపై భారత్ తొందరపడకుండా, వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందన్న సంకేతాలను ఆయన ఇచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts