telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సంక్రాంతి రేసులో “వకీల్ సాబ్” కూడా…!

Vakeel-Saab

రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. ఎంసీఏ డైరెక్టర్ వేణుశ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకఫూర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎప్పుడో రావాల్సిన వకీల్ సాబ్ సినిమా ఇప్పటి వరకు రాలేదు. ఇప్పడు సినిమా షూటింగ్ లు తిరిగి ప్రారంభం కావడంతో అందరు తమతమ సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. అయితే డిసెంబర్‌లో మాత్రమే పవన్ ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు వార్తలు రావడంతో ‘వకీల్ సాబ్’ సంక్రాంతికి విడుదల కాకపోవచ్చని అంతా భావించారు. కానీ పవన్ నిన్న వకీల్ సాబ్ షూటింగ్ తిరిగి ప్రారంభించాడు. దాంతో  వకీల్ సాబ్ సంక్రాంతి రేసులో ఉందని అందరికీ క్లారిటీ వచ్చింది. నిజానికి మధ్యలో అగకపోయి ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయి ఎప్పుడో మేలోనే రిలీజ్ అయిపోయి ఉండేది. 

Related posts