telugu navyamedia
సినిమా వార్తలు

“యురేక” టీజర్… ఆ ఒక్కటే బాలేదు…

Eureka

కార్తీక్ ఆనంద్, షాలిని, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “యురేక”. కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రశాంత్‌ తాత నిర్మిస్తున్నారు. లలితకుమారి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. లవ్‌ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన టీజర్ కూడా యూత్ ను ఆకట్టుకునే విధంగా ఉంది. అయితే టీజర్ లో వచ్చే బూతు పదాన్ని తొలగిస్తే బాగుందేమో… త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts