జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తావైసీపీ, టీడీపీలకు కొమ్ముకాసేందుకు జనసేన సిద్దంగా లేదని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తిరుపతిలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్… జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాష్ట్రం, దేశంలో మూడో ప్రత్యామ్నాయం చాలా అవసరం ఉందన్నారు . 2009లో ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించినప్పుడు గొప్ప మార్పును ఆశించామని తెలిపారు.
అయితే కొంతమంది వైఎస్ఆర్ కుటుంబానికి సాన్నిహిత్యంగా ఉన్నకోవర్ట్‌ల వల్లే అప్పట్లో పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సి వచ్చిందన్నారు పవన్ కల్యాణ్. ఆనాడు చిరంజీవిపై ఒత్తిడి తీసుకొచ్చి పార్టీ విలీనం చేయించారని ఆరోపించారు.ఈ రోజు వారిలో కొందరికి మంత్రిపదువులు కూడా ఉన్నాయని అన్నారు.
ప్రజారాజ్యం ఉంటే ప్రత్యామ్నాయం ఉండేదని పేర్కొన్నారు. తనను కూడా పార్టీలోకి రమ్మంటే నేను రాను పొమ్మన్నానంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఏ సీఎంలకు తాను భయపడనని.. ఇక్కడే ఉంటానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు జనసేనాని పవన్ కల్యాణ్. తనను దత్తపుత్రుడు అని సంబోధిస్తున్న జగన్ మోహన్‌ను ఇవాల్టి నుంచి తాను ఆంధ్రప్రదేశ్ థానోస్ అంటూ నామకరణం చేశారు. మార్వెల్‌లోని క్యారెక్టర్‌తో పోల్చారు పవన్. వైసీపీ థానోస్ నవరత్నాలు అంటూ అందర్నీ చంపేస్తున్నారని ఆరోపించారు.
అలాగే రాయలసీమ చదువుల సీమ అయితే.. దానిని ఫ్యాక్షన్ సీమగా ప్రచారం చేస్తున్నారంటు మండిపడ్డారు. ఎన్నో గ్రంథాలయాలకు నెలవు రాయలసీమ అని.. అల్లసాని పెద్దన్న వంటి మహనీయులు పుట్టిన గడ్డ ఇది డబ్బు అహంకారంతో విర్రవీగితే మడిచి ఎక్కడైనా పెట్టుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఓ సామజిక వర్గాన్ని గంపగుత్తగా అమ్మేస్తున్నామని విమర్శిస్తున్నారని… తాను ఎవరికీ కొమ్ముకాయడం లేదన్నారు పవన్.
తాను మాత్రం ప్రజల తరఫున గట్టిగా నిలబడేందుకే వచ్చానన్నారు పవన్. రాజకీయంలో మార్పు వచ్చే వరకూ ఉంటానన్నారు. రాజకీయంలో మార్పు వస్తే పోతానన్నారు. పీఆర్పీ విలీనం సమయంలో తనకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి పార్టీలో చేరమని కూడా ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. తాను రాజకీయాల్లోకి కొత్త కావచ్చు కానీ… మనుషుల మనస్తత్వాలకు కొత్తకానన్నారు పవన్.
2014 ఎన్నికల సమయంలో నాకు టీడీపీ రెండు మూడు సార్లు కబురు పంపిస్తే.. తాను మాట్లాడలేదు. అయితే టీడీపీతో కలిసి వెళ్తున్నామని అప్పటి ప్రధాని అభ్యర్థి మోదీ చెప్పారు. జనసేన కూడా మద్దతు ఇస్తే బాగుంటుందని చెప్పారు. జనసేన మద్దతు కావాలంటే మీరు మా ఆఫీసుకు వచ్చి ఆతిథ్యం స్వీకరించమని చంద్రబాబుకు చెప్పాను. ఏం ఆశించకుండా టీడీపీకి మద్దతు ఇచ్చాను’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు.
కంస్ట్రక్టివ్ పాలిటిక్స్ అంటే తనకు ఇష్టమని.. డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయబోనన్నారు పవన్. కుప్పంలో జనసేనను ఇబ్బంది పెడుతుంటే అక్కడ ప్రతిపక్షాలను కలుపుకొని వెళ్ళామని గుర్తు చేశారు.
ఎంత పెద్ద స్టేటస్ వ్యక్తి అయినా ఇంటి ముందు నడుచుకుంటూ వచ్చే సంప్రదాయం వైసీపీ తీసుకొచ్చిందని ఎద్దేవా చేశారు. ఇంకోసారి వైసీపీ అధికారంలోకి వస్తే జపాన్‌లో మద్యం పోటీలు పెట్టినట్లు పెడుతారన్నారు.
తమ స్ట్రాటజీని బయటకు చెప్పబోమని.. దానిని రహస్యం గా ఉంచుతామని తెలిపారు. తమ ఎన్నిక వ్యుహం సమయం వచ్చినప్పుడు చెబుతామని అన్నారు. వైసీపీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది తమ విధానం అని చెప్పారు. ద్వేష పూరిత రాజకీయాలు చేసి, అందరినీ చావగొడుతుంటే వైసీపీ రాకూడదనే కోరుకుంటామని తెలిపారు. తమ స్ట్రాటజీ ఓపెన్ చేయలేదని.. అది చిదంబర రహస్యంగానే ఉంటుందన్నారు.
వైసీపీని ఓడించడమే తమ ప్రథమ అజెండా అని గుర్తు చేశారు పవన్ కల్యాణ్. పార్టీలోకి రావాలంటే ముందుగా జనసేన కార్యకర్తలను గౌరవించాలని నేతలకు సూచించారు.
ఆంధ్ర Thanos, వైసీపీ Thanos నవరత్నాలు అని చెప్పి మన అందర్నీ చంపేస్తున్నాడు. నన్ను దత్త పుత్రుడు అంటారు కాబట్టి ఆంధ్ర Thanos అని నామకరం చేస్తున్నా – JanaSena Chief Sri @PawanKalyan #AndhraThanosJaganReddy pic.twitter.com/sPn2qPfvTK
— JanaSena Party (@JanaSenaParty) August 21, 2022
రాజధానిని మారుస్తామని బొత్స చెప్పలేదు: మంత్రి అవంతి శ్రీనివాస్