telugu navyamedia
తెలంగాణ వార్తలు

అమిత్ షాకు చెప్పులు అందించిన బండి సంజయ్: ‘ఢిల్లీ చెప్పులు మోసే గుజరాతీ గులాములను..’

మునుగోడు ఉపఎన్నికలు తెలంగాణలో రాజకీయ హీట్ పెంచాయి. అధికార టీఆర్ఎస్ పార్టీతో సహా.. కాంగ్రెస్, బీజేపీలు గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు.

ఆదివారం మునుగోడు నియోజకవర్గంలో జరిగిన బీజేపీ బహిరంగసభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  అమిత్‌షా పర్యటన సందర్భంగా ఉజ్జయిని మహాంకాళి అమ్మ‌వారిని సందర్శించారు. ఆ సమయంలో పూజలు చేసి గుళ్లో నుంచి బయటకు వచ్చిన అమిత్‌షా చెప్పులను బండి సంజయ్ చేతితో తీసి అందించారు.

Thumbnail image

ఇది ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయ‌గా వైరల్‎గా మారింది.ఈ వీడియోతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్‌ పెరిగిపోయంది. దీనిపై ప్రత్యర్థులు కామెంట్స్‌ జోరు పెంచారు. ఓవైపు టీఆర్‌ఎస్‌ మరోవైపు కాంగ్రెస్‌ విమర్శలకు పని చెప్పాయి..

దీనిని షేర్ చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు.. గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా ? అంటూ బండి సంజయ్‌ను ప్రశ్నిస్తున్నారు. భవిషత్తులో అమిత్ షా కాళ్ల దగ్గర తెలంగాణను తాకట్టు పెడతారనడానికి ఈ ఘన ఉదాహరణ అంటూ పోస్టులు చేస్తున్నారు. ఎందుకింత బానిసత్వం? అంటూ బండి సంజయ్‌ను ట్రోల్ చేస్తున్నారు.

ఈ వీడియోపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న  నాయకున్ని –  తెలంగాణ  రాష్ట్రం గమనిస్తోందని ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉందని తన ట్విట్ట్‌లో రాసుకొచ్చారు.

అటు కాంగ్రెస్ కూడా ఘాటుగా స్పందిస్తోందీ . బానిస రాజకీయాలకు బీజేపీ తెరలేపిందని అన్నారు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌. అమిత్‌షా చెప్పులను బండి సంజయ్‌ మోశారని అన్నారు. ఈ చర్యతో తెలంగాణ సమాజాన్ని అమిత్‌ షా కించపరిచరాని మండిపడ్డారు. మోదీ, అమిత్‌ షా కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు.

 

Related posts