ఏపీలోని దేవతామూర్తులు, ఉత్సవ రథాల విధ్వంసంపై జనసేన-బీజేపీ నిరసనకు దిగాయి. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని తన ఆఫీసు వద్ద’ధర్మ పరిరక్షణ దీక్ష’కు దిగారు.
ఇటీవల తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం రథం అగ్నికి ఆహుతైన ఘటనతో పాటు హిందూ దేవాలయాల విషయంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలను నిరసిస్తూ ఈ దీక్షకు దిగినట్లు జనసేన నేతలు చెబుతున్నారు.
రథాల విధ్వంసంపై ప్రభుత్వ నిర్లిప్త వైఖరికి నిరసనగా జనసేన-బీజేపీ సంయుక్తంగా పిలుపునిచ్చిన “ధర్మ పరిరక్షణ దీక్ష” లో భాగంగా హైదరాబాద్ లోని తన నివాసంలో పవన్ పాల్గొన్నారని జనసేన ప్రకటన చేసింది. దేవాదాయ ఆస్తులను కాపాడాలని జనసేన డిమాండ్ చేసింది.ఆఫీసు ఆవరణలో కుర్చీలో కూర్చొని పుస్తకం చదువుతూ ఆయన దీక్షలో పాల్గొన్నారు.
ఏపీలో విద్యుత్ కోతలు.. ప్రభుత్వంపై పవన్ చురకలు!