telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కాంగ్రెస్ కు ఉన్నంత ఓటు బ్యాంకు కూడా బీజేపీకి లేదు: తలసాని

talasani srinivasayadav on clp merger

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత ఓటు బ్యాంకు కూడా బీజేపీకి లేదని  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గాలి పనిచేసిందని తలసాని అంగీకరించారు. రాజకీయాలకు పనికిరాని కొందరు వ్యక్తులు ఆ గాలిలోనే గెలుపొందారని దుయ్యబట్టారు.

హైదరాబాద్ ను కూడా కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారన్నది ఊహాగానాలేనని అన్నారు. ఏపీలోని టీడీపీ నేతలను చంద్రబాబు స్వయంగా బీజేపీలోకి పంపారని ఆయన ఆరోపించారు. క్యాడర్ లేకుండా నేతలను చేర్చుకున్నంత మాత్రాన ఏ పార్టీ కూడా బలపడదని స్పష్టం చేశారు. ప్రస్తుం బీజేపీలో కాలంతీరిన నేతలు చేరుతున్నారనీ, దీనివల్ల బీజేపీకి ఒరిగేదేమీ లేదని స్పష్టం చేశారు.

Related posts