telugu navyamedia
ఆంధ్ర వార్తలు

2024లో ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని స్థాపిస్తాం..-ప‌వ‌న్

*ఇప్పటం గ్రామానికి జనసేన ట్రస్ట్ ద్వారా రూ.50 లక్షలు ప్రకటించిన పవన్ కళ్యాణ్

*జనసైన్యం లేకుంటే పవన్ కళ్యాణ్ లేడు.. జనసేనా పార్టీ లేదు.

*2024లో ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని స్థాపిస్తాం..
*ప్ర‌శ్నించ‌డం అంటే మార్పున‌కు శ్రీకారం చుట్ట‌డం..
*తెలంగాణ ఉద్యమ స్పూర్తితో, స్వాతంత్ర ఉద్యమం స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను.

*పార్టీ నడపాలంటే సైద్ధాంతిక బలం ఉండాలి..
*ఎంత సింధూ అయిన బిందువుతో మొదలవుతోంది.
*ఏపీ రాష్ట్రం బాగుండాలంటే జనసైనికుల చేతుల్లో ఉంది.
*చీకట్లోకి వెళ్తున్న రాష్ట్రాన్ని కాపాడుకుందాం.

2024లో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన ఆవేపూరిత ప్రసంగం చేశారు.

పవన్ ప్రసంగించే ముందు జై ఆంధ్ర, జై తెలంగాణ, జై భారత్ అని ప్రసంగాన్ని ప్రారంభించారు.రాష్ట్రం నలుమూలల నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి జనసేన తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమానికి వచ్చిన ఆడబెబ్బులి లాంటి వీరమహిళలకు, కొదమ సింహాల్లాంటి జన సైనికులకు, సత్తువ, ధైర్యంతో కొత్త తరం లోకల్ బాడీలో గెల్చిన వారికి, పోటీ చేసినవారికి హృదయపూర్వక నమస్కారాలు చెప్పిన పవన్.

ఈ సందర్భంగా ఇప్పటం గ్రామపంచాయతీకి రూ.50 లక్షలు ఆయన ప్రకటించారు. జనసైనికులు కొదమ సింహాలై గర్జించాలని పిలుపునిచ్చారు. అణగారిన వర్గాలకు అండగా ఉండాలనే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో విభేదాలుండొచ్చు..వ్యక్తిగత ధ్వేషాలొద్దని పవన్‌ సూచించారు.

తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం అన్ని పార్టీలకు ఆయనక అభివాదం చేశారు. తన సంస్కారం వైసీపీ నాయకులకు కూడా నమస్కారం చెప్పమంటోందని సెటైర్లు వేశారు పవన్. ఈ సందర్భంగా వైసీపీలోని కొందరి నాయకులపై విమర్శలు చేశారు. మేకపాటి గౌతం రెడ్డిని స్మరించుకున్నారాయన.

పార్టీని నడపాలంటే వేలకోట్లు అవసరం లేదన్న పవన్.. సైద్దాంతిక బలం ఉంటే చాలని చెప్పారు.   ఆనాడు ఆరుమందితో ప్రారంభమైన జనసేన ఇవాళ లక్షల మంది జనసైనికులతో బలంగా నిలబడిందన్నారు. 150 మందితో ప్రారంభమై ఐదు లక్షల మంది క్రియాశీల సభ్యుల దిశగా పుంజుకుంటుందన్నారు పవన్. ఇవాళ పార్టీ కార్యకర్తలు సుమారు యాభై లక్షల వరకు ఉందన్నారు.

వైసీపీ, టీడీపీతో పోల్చుకుంటే జనసేన చాలా త్వరగా పుంజుకున్నామన్నారు పవన్. 7 శాతం నుంచి 27శాతానికి, 27 శాతం నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శాతంగా జనసేన ఎదగబోతుందన్నారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో వ్యక్తుల వ్యక్తిత్వం బయటపడుతుందన్నారు. నాయకత్వం అంటే ఎంతమందిని ప్రభావితం చేయగలమన్నది ముఖ్యం. నాయకత్వం అంటే తన సర్వస్వం కోల్పోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమన్నారు పవన్. ద్వేషించే శత్రువులను కూడా క్షేమించి వదిలేయడం అన్నారు.

ఈ రాష్ట్ర భవిష్యత్‌ చీకట్లోకి వెళ్లకూడదనుకుంటే ఆ పని జనసేన క్రియాశీల సభ్యులపై ఆధారపడి ఉందన్నారు పవన్. తాను నడిచి చూపిస్తానన్నారు. చాలా అరుదుగా కొత్త తరానికి దిశానిర్దేశం చేయాల్సి వచ్చిందన్నారు. ఈ చీకటి పాలన అంతం చేసి వెలుగులోకి తీసుకురావాల్సి వచ్చిందన్నారు.

Related posts