telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సీఎం జగన్‌ ఓట్లు అడగకముందే ఈ ఫలితాలు…

sajjala

మున్సిపల్‌ ఎన్నికల్లో వైసీపీ దుమ్ములేపుతోంది. ఇప్పటికే 55 పైగా మున్సిపాలిటీలను కైవలసం చేసుకుంది వైసీపీ. అయితే.. దీనిపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ప్రభుత్వానికి మరింత సానుకూలత పెరిగిందని వచ్చిన ఫలితాలను బట్టి తెలుస్తుందని.. ఎన్నికల్లో వైసీపీ ఏకపక్షంగా, అన్ని చోట్లా స్వీప్ చేసిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 20 నెలల సీఎం వైఎస్ జగన్ సంక్షేమ అభివృద్ది పథకాలు, సహా సీఎం నాయకత్వాన్ని ఫలితాలు బలపరిచాయని…ఇది ప్రజల విజయమని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పాలన జరిగిందని.. అఖండ విజయం ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు అని సజ్జల తెలిపారు. ప్రజలపై సీఎం జగన్‌కు ఎంతో నమ్మకం ఉందని.. అందువల్లే కనీసం ఓట్లు కూడా అడగలేదని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ పై ప్రజలు విశ్వాసాన్ని మరో సారి చూపించారని… మేనిఫెస్టోలో చెప్పినవన్నీ నూటికి నూరు శాతం అమలు చేశారని.. మేనిఫెస్టోలో చెప్పని హామీలనూ సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని కొనియాడారు. సీఎం జగన్ పాలనలో ప్రజలకు పూర్తి భరోసా వచ్చిందని… రాష్ట్రంలో సంక్షేమం అభివృద్దిని అన్ని వర్గాల ప్రజలకు అన్ని ప్రాంతాల్లో అమలు చేశారని తెలిపారు. 20 నెలల్లో ప్రజల సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు పని చేయలేదని..లేని సమస్యలు సృష్టిస్తూ ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఫైర్‌ అయ్యారు. అమరావతిలో చంద్రబాబు చేసిన మోసాన్ని వైఎస్ జగన్ సరిదిద్దే ప్రయత్నం చేసారని తెలిపారు. విజయవాడ, గుంటూరు ప్రజలు తమ రోషాన్ని చూపించి చంద్రబాబును ఒడించి జగన్ ను గెలిపించారని పేర్కొన్నారు.

Related posts