రేపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖలో ఆ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. బాలరాజు ఎన్నికలకు కొద్దిరోజుల ముందే జనసేనలో చేరారు.
విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన ఓటమిపాలయ్యారు.ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మి గెలుపొందారు. తన రాజీనామాకు దారితీసిన కారణాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఓ లేఖలో బాలరాజు తెలియజేశారు. కొన్ని నిర్ణయాలు ఎంతో వేదన కలిగించినా, రాజీనామా చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించారు.

