బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా, హీరో అర్జున్ కపూర్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్టు ఎప్పటినుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇటీవలే అర్జున్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా మలైకా తాము రిలేషన్ లో ఉన్న విషయం వాస్తవమేనని స్పష్టం చేసింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్ల నుంచి విమర్శలు కురిశాయి. ఎందుకంటే అర్జున్ కంటే వయసులో దాదాపు 12 ఏళ్లు పెద్దది మలైకా. అంతేకాదు ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే మలైకా కూడా నెటిజన్లకు ధీటుగానే సమాధానం ఇచ్చింది. తాజాగా మలైకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశారు. తన కుమారుడితో కలిసి సెల్ఫీ దిగిన ఫొటో అది. దానికి క్యాప్షన్‌గా.. ‘కొడుకు ఒంట్లో బాలేని తన తల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నప్పుడు..’ అని పేర్కొన్నారు. క్యాప్షన్ బాగానే ఉంది కానీ ఫొటో చాలా వైరల్ అవుతోంది. ఎందుకంటే ఫొటోలో మలైకా దుస్తులు సరిగ్గా లేవు. ఎద భాగం కనిపించేలా నైటీ వేసుకుని కొడుకుతో కలిసి ఫొటో దిగడం కొందరు నెటిజన్లకు మింగుడు పడలేదు. కొడుకు చిన్న పిల్లాడు అయివుంటే అది వేరు. కానీ ఇప్పుడు అర్హాన్ వయసు పదహారేళ్లు. టీనేజ్ కొడుకు ఇంట్లో ఉన్నప్పుడు కన్నతల్లి వేసుకోవాల్సిన దుస్తులేనా అవి అని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మలైకా మాత్రం ఇలాంటి కామెంట్స్‌ని అస్సలు పట్టించుకోరు. నా బాడీ నా ఇష్టం అంటూ ఇప్పటివరకు చాలా సార్లు ఘాటుగా స్పందించారు. ఇటీవల మలైకా తన 46వ బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. అదే రోజున తాను అర్జున్ కపూర్‌తో డేటింగ్‌లో ఉన్నానని అతనితో కలిసి దిగిన రొమాంటిక్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
previous post
నామీద నాకే అసహ్యం వేసింది : విద్యాబాలన్