telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

నిలకడగా బంగారం..భారీగా పడిపోయిన వెండి ధరలు

మనదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కరోనా టైంలో బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే…తాజాగా బులియన్‌ మార్కెట్‌లో రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు తాజాగా స్థిరంగా ఉండిపోయింది. అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 47,780 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 43,800 పలుకుతోంది. బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధరలు మాత్రం భారీగానే తగ్గిపోయాయి. కిలో వెండి ధర రూ. 1200 తగ్గి రూ. 72,800 వద్ద కొనసాగుతోంది.

Related posts