telugu navyamedia
నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల తర్వాత అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభం  ఆయనవి.

ఈ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టబోయే పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించానున్నారు.
ముందుగా రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కేంద్ర ఆర్ధిక మంత్రి ఆర్ధిక సర్వేను ప్రవేశ పెట్టనున్నారు.

ఆ తర్వాత రేపు (ఫిబ్రవరి 1) 2025-26 యేడాదికి గాను బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.

మరోవైపు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కీలకమైన ఢిల్లీ అసెంబ్లీలు ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి.
బడ్జెట్ లో ప్రభుత్వం ప్రకటించే వాటితో ఢిల్లీ ప్రజలు ఏమైనా ప్రభావితం అవుతారా అనేది చూడాలి.

ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లో మోడీ గవర్నమెంట్ పార్లమెంట్ కు తీసుకురాబోతున్నట్టు అఖిల పక్ష సమావేశంలో వెల్లడించింది.

ఇప్పటికే డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు, పలు పార్టీల ఎంపీలు అటెండ్ అయ్యారు.

ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టే బిల్లులు లిస్ట్ ను కేంద్ర సర్కార్ అఖిల పక్షానికి అందజేసింది. ఇందులో వక్ఫ్ సవరణ బిల్లు కూడా ఉంది.

మొత్తంగా 62 బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. అందులో 16 కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించేలా కేంద్ర ప్రణాళికలు రచిస్తోంది.

వక్ఫ్ చట్ట సవరణ కోసం కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీని బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్ నేతృత్వంలో ఏర్పాటు చేసింది. అందులో వక్ఫ్ సవరన బిల్లును జేపీసీ ఆమోదించింది. ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఇందులో 44 మార్పులు సూచించారు.

అందులో 14 సవరణకు కమిటీ ఆమోద ముద్ర వేసింది. అంతేకాదు ఈ బిల్లుకు సంబంధించిన తుది నివేదికను సిద్దం చేసి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేసారు.

వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతతో పాటు జవాబుదారి తనాన్ని తీసుకొచ్చే ఉద్దేశ్యంతో మోడీ సర్కార్ ఈ బిల్లును తీసుకొచ్చింది.

Related posts