బీజేపీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్ లపై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి మండిపడ్డారు. జర్మనీలో నాజీ సిద్ధాంతాలు, భావజాలంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) స్ఫూర్తి పొందిందని ఇమ్రాన్ విమర్శించారు. కశ్మీర్ లో కర్ఫ్యూ అణచివేతతో పాటు సామూహికత హత్యలకు ఆ సంస్థ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. జాతి హననం ద్వారా కశ్మీర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాజీ జాతీయవాదం తరహాలో ఆరెస్సెస్ హిందూ జాతీయవాదం కేవలం కశ్మీర్ వరకే ఆగిపోదన్నారు. భారత్ లోని ముస్లింలదరినీ వీళ్లు అణచివేస్తారని పేర్కొన్నారు. చివరికి వాళ్లు పాకిస్థాన్ ను కూడా లక్ష్యంగా చేసుకుంటారని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. వీళ్లంతా హిట్లర్ జాతీయవాదానికి హిందూ వెర్షన్ లాంటివాళ్లని అన్నారు.
జగన్ గారూ మీరు ఏపీకి సీఎం.. సాక్షి పేపర్ చదవడం మానేయండి?: నారా లోకేశ్