యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న యూత్ ఎంటర్‌టైనర్ ‘ఒరేయ్ బుజ్జిగా..’. ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబ్బా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కృష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్ ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేయాలని నిర్మాత భావించారు. కానీ, కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూతబడటంతో కుదరలేదు. యూత్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య విడుదల చేశారు. “ఒరేయ్ బుజ్జిగా” చిత్రబృందానికి ఈ సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.
దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా మంచి ఫన్ రైడ్ అని అర్థమైపోతుంది. “మీ అమ్మాయిలకు రిలేషన్‌షిప్‌లో ఉన్నంత సేపు బోయ్ ఫ్రెండ్ లక్స్ సోప్ లాంటోడు.. ఒల్లంతా రాసేసుకుంటారు.. బ్రేకప్ అయిపోయిన తర్వాత డెటాల్ సోప్ లాంటోడని చేతులు మాత్రమే కడుక్కుంటారు” వంటి డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాయి. ఐ.ఆండ్రూ విజువల్స్, అనూప్ రూబెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
నాడు 18 సీట్లు నేడు ఒక్కటి .. వర్మ ఆసక్తి కర వ్యాఖ్యలు