సాధారణంగా వర్షం కారణంగా, వెలుతురు లేమి కారణంగా క్రికెట్ మ్యాచ్‌లు ఆగిపోతుండడం అందరికీ తెలిసిందే. మంచు కురుస్తున్నదనే కారణంతో కూడా కొన్నిసార్లు మ్యాచ్‌లు నిలిచిపోయాయి. అయితే క్రికెట్ చరిత్రలో తొలిసారి వెలుతురు కారణంగా ఓ మ్యాచ్ ఆగిపోయింది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ రోజు (బుధవారం) నేపియర్‌లో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది.
టాస్ గెలిచి బ్యటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 38 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ విరామ సమయానికి 9 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 41 పరుగులు చేసింది. విరామం అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా రెండో బంతికే రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. అనంతరం కోహ్లీ క్రీజులోకి వచ్చి నాలుగు బంతులు ఎదుర్కొని రెండు పరుగులు చేశాడు. ఈ దశలో సూర్యకాంతి నేరుగా బ్యాట్స్‌మెన్ కళ్ళలో పడుతుండడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపేశారు. `సూర్యకాంతి నేరుగా బ్యాట్స్‌మెన్ కంట్లో పడుతోంది. కాబట్టి ఆటగాళ్ల, అంపైర్ల భద్రత దృష్ట్యా మ్యాచ్‌ను నిలిపేశాం. పరిస్థితులు మెరగయ్యాక మ్యాచ్‌ను తిరిగి ప్రారంభిస్తాం. నా 14 ఏళ్ల కెరీర్‌లో సూర్యుడి కారణంగా మ్యాచ్ ఆగిపోవడం ఇదే తొలిసారి. అయితే మ్యాచ్‌కు మరో అరగంట అదనపు సమయం ఉంది. మరో అరగంటలో పరిస్థితులు మెరుగుపడి మ్యాచ్ తిరిగి ప్రారంభమైతే పూర్తిగా 50 ఓవర్ల ఆట సాధ్యమవుతుంద`ని అంపైర్ షాన్ హాగ్ తెలిపారు.
దీనితో భారత్ విజయలక్ష్యాన్ని 49 ఓవర్లలో 156 పరుగులుగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని 34.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి భారత్ ఛేదించింది. 6 ఓవర్లలో 2 మెయిడెన్లు వేసి 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసిన షమీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.
వకీల్ సాబ్ పై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు…