telugu navyamedia
రాజకీయ

ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ

Priyanka Gandhi started Ist road show
సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌   హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రియాంక గాంధీని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ ప్రచార ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలను అప్పగించింది.
ఇక ఉత్తర ప్రదేశ్ తూర్పు ఇన్చార్జిగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి ప్రియాంక గాంధీ బాధ్యతలు చేపడతారని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక నియామకంతో హిందీ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా స్టార్‌ క్యాంపెయిన్‌ర్‌గా ఆమె సేవలను వాడుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దీటుగా ఎదుర్కొనే క్రమంలో ప్రియాంకను తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

Related posts