telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డేటింగ్ యాప్ లో మహిళా ఎంపీ ఫోటోలు… !

Nusrat

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నుస్రత్ జహాన్ ఫోటోను ఓ డేటింగ్ యాప్‌లో చూసిన భస్వాతి అనే నెటిజన్ దాన్ని స్క్రీన్‌ షాట్ తీసి ట్వీట్ చేశారు. ఎంపీగా ఉన్న నుస్రత్ ఫోటోను వీడియో ఛాటింగ్ కోసం ఎలా వాడుతున్నారంటూ ఆమె ట్వీట్‌లో పేర్కొంది. ఈ విషయం నుస్రత్ దృష్టికి వెళ్లడంతో ఆమె తీవ్రంగా స్పందించారు. “ఆన్‌లైన్ డేటింగ్, వీడియో ఛాటింగ్ యాప్‌లో నా అనుమతి లేకుండా ఫోటో పెట్టారు. యాప్‌లో ప్రకటన కోసం వాడుకున్న నా ఫోటో స్క్రీన్‌ షాట్‌ను షేర్ చేస్తున్నాను. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అంటూ నుస్రత్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను కోల్‌కతా పోలీస్ కమిషనర్ అనూజ్ శర్మకు ఆమె ట్యాగ్ చేయడంతో పోలీసులు వెంటనే స్పందించారు. డేటింగ్ యాప్‌పై విచారణ చేపట్టి త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన నుస్రత్ జహాన్ ఆ తర్వాత బెంగాలీ సినిమాల్లో నటిగా రాణించారు. మమతా బెనర్జీ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి 2019లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. బసీర్‌హాట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్‌ జైన్‌ను ప్రేమించి టర్కీలో వివాహం చేసుకున్నారు.

Related posts