టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బుల్లి తెర ప్రేక్షకులకు ‘బిగ్ బాస్’ తో పరిచయమయ్యాడు. అయితే ఆ షో తో మంచి పేరు తెచ్చుకున్నా ఎన్టీఆర్ ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అంటూ మన ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే ఈ రియాల్టీ షో ప్రోమ్ తో ఆడియన్స్ లో బజ్ ఏర్పడింది. అతి త్వరలో ఆరంభం కాబోతున్న ఈ షో కి హాజరుకాబోయే కంటెస్టెంట్స్ ఎంపిక కోసం కొన్ని ప్రశ్నలను సంధించబోతున్నారు. అందులో మొదటి ప్రశ్నను ఈ నెల 29న వదలబోతున్నట్లు ప్రకటనను విడుదల చేశారు. ‘ఇక్కడ కథ మీది కల మీది.. ఆట నాది కోటి మీది… రండి గెలుద్దాం’ అంటూ ప్రోమోతో మెస్మరైజ్ చేసిన జూనియర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ గేమ్ షో మొదటి ప్రశ్నకు సంబంధించి ప్రోమో కూడా వదిలారు. ఇందులోనే మార్చి 29 రాత్రి 8.15కి మొదటి ప్రశ్న అడగబోతున్నట్లు తారక్ చెప్పాడు. ఈ గేమ్ షో ప్రోమోలకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించటం విశేషం. ఈ గేమ్ షో మూడు సీజన్స్ కు నాగార్జున, ఓ సీజన్ కు చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఈ గేమ్ షో కొన్ని మార్పులతో ఎన్టీఆర్ హోస్ట్ రాబోతోంది.
previous post
next post