ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. రేపు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మోదీకి విరించనున్నారు ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రాన్ని చంద్రబాబు అందచేయనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను కూడా రేపు చంద్రబాబు నాయుడు కలవనున్నారు.
ప్రధానంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలసి వచ్చే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు వీలయినన్ని ఎక్కువ నిధులు కేటాయించాలని కోరనున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి రావల్సిన పెండింగ్ ప్రాజెక్టులను, నిధులపై కూడా వివిధ శాఖల మంత్రులను కలిసి చర్చించనున్నారు.
రాష్ట్ర ప్రయోజనాలపై జగన్ దెబ్బకొడుతున్నాడు: దేవినేని ఉమ