నాన్-సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర 19 రూపాయాలు పెరిగింది. పెంచిన ధరలు ఈ ఏడాది జనవరి ఒకటవ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. సిలిండర్ ధరలు వరుసగా అయిదవ నెల పెరగడం గమనార్హం. ఢిల్లీ, ముంబై నగరాల్లో నాన్ సబ్సిడీ సిలిండర్‌పై 19, 19.5 రూపాయలు పెరిగినట్లు తెలుస్తోంది.
దీంతో ఢిల్లీలో సిలిండర్‌పై రూ.714, ముంబైలో రూ.684 వసూల్ చేయనున్నారు. పెరిగిన ధరల గురించి ఐవోసీ తన వెబ్సైట్లో మరిన్ని విషయాలను వెల్లడించింది. కోల్‌కతా, చెన్నై నగరాల్లో నాన్ సబ్సిడీ సిలిండర్‌పై 21 రూపాయాలు పెంచారు.


వారి త్యాగాల ఫలితమే బీజేపీ : బండి