telugu navyamedia
క్రీడలు వార్తలు

ఓ ఇంటివాడైన పంజాబ్ కింగ్స్ ఆటగాడు…

పంజాబ్ కింగ్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్, విండీస్ హిట్టర్ నికొలస్ పూరన్.. ఓ ఇంటివాడయ్యాడు. తన ఫియాన్సీ అలైసా మిగ్యెల్‌ను పెళ్లి చేసుకున్నాడు. ట్రినిడాడ్ అండ్ టుబాగో రాజధాని పోర్ట్ ఆప్ స్పెయిన్‌లో నిరాడంబరంగా జరిగిన కార్యక్రమంలో తన ఫియాన్సీ వేలికి ఉంగరాన్ని తొడిగాడు. ఐపీఎల్ 2021 ఫేస్ 2కు సంబంధించిన షెడ్యూల్ వెలువడిన రెండోరోజే ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాడతను. నిజానికి ఈ ఏడాది చివరిలో పెళ్లి చేసుకోవాలని తొలుత పూరన్ భావించాడు. ఐపీఎల్ 2021 ఫేస్ 2, కరేబియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో పాల్గొనాల్సి ఉన్నందున..వివాహ కార్యక్రమాన్ని ముందుకు జరిపాడు. ఈ రెండు టోర్నమెంట్ల కంటే ముందే ఇంటివాడయ్యాడు. గత ఏడాది నవంబర్‌లో పూరన్-అలైసా మధ్య ఎంగేజ్‌మెంట్ పూర్తయింది. ఏడాది తరువాత పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ భావించినప్పటికీ.. బిజీ షెడ్యూల్ ఉన్నందున అయిదు నెలలు ముందుగానే పెళ్లాడాడు. ఈ సందర్భంగా పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, తోటి క్రికెటర్స్ అతన్ని అభినందించారు.

Related posts