telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

మద్యం హోం డెలివరీకి ఢిల్లీ అనుమతి…

arvind-kejriwal

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా కారణంగా చాలా రాష్ట్రాలు లాక్ దౌఎం విధించి దానిని పొడిగిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఈ క‌రోనా వ‌ల్ల లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను అమ‌లు చేస్తున్న రాష్ట్రాలలో ఢిల్లీ ఒక్కటి. కాగా, మందుప్రియులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మద్యం హోం డెలివరీకి అనుమతి ఇచ్చింది. ఆన్‌లైన్‌లో దేశీయ, విదేశీ మద్యం విక్రయించుకునే వెసలుబాటు కల్పించింది. వెబ్‌పోర్టల్‌ లేదా యాప్‌ ద్వారా మద్యం ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది. భార‌తీయ కంపెనీల‌కు చెందిన మ‌ద్యం కానీ.. విదేశాల‌కు చెందిన మ‌ద్యాన్ని అయినా ఇంటికి డెలివ‌రీ చేసుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అయితే హాస్ట‌ళ్లు, ఆఫీసులు, సంస్థ‌ల‌కు మాత్రం మ‌ద్యం హోండెలివ‌రీ ఉండ‌ద‌న్నారు. చూడాలి మరి ఇంకా ఈ నిర్ణయం ఏ రాష్ట్రం తీసుకుంటుంది అనేది.

Related posts