హరియాణాకు చెందిన బీజేపీ నాయకురాలు, టిక్‌టాక్ స్టార్ సోనాలీ ఫోగాట్(42) హత్య కేసులో కొత్త ట్విస్ట్ తాజాగా వెలుగుచూసింది.
తొలుత గుండెపోటుతో సోనాలీ మరణించిందని చెప్పినా, ఆమె సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి జరిపిన దర్యాప్తులో హత్య అని తేలింది.
పోస్టుమార్టంలో సోనాలి శరీరంపై కమిలిన గాయాలను కూడా గుర్తించారు. సోనాలి మంగళవారం ఉదయం చనిపోగా.. ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో గురువారం పోస్టుమార్టం నిర్వహించారు.
సోనాలీ హత్య కేసుకు సంబంధించి సోనాలి ఫోగట్ ఇద్దరు సహాయకులు, సుధీర్ సాంగ్వాన్,సుఖ్‌విందర్ వాసిలను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో.. ఈ ఇద్దరూ ఆమెకు ఇచ్చిన డ్రింకులో 1.5 గ్రాముల ఎండీఎంఏ కలిపినట్లు అంగీకరించారు.
మత్తు పానీయం తాగిన సోనాలీ ఫోగాట్ నియంత్రణలో లేనపుడు ఆమెను నిందితుడు టాయిలెట్‌కి తీసుకెళ్లి రెండు గంటల పాటు లోపల ఉంచాడని, ఆ సమయంలో టాయిలెట్‌లో ఏం చేశాడనే విషయంపై గోవా పోలీసులు ఆరా తీస్తున్నారు.
అంతేకాదు.. దీనికి సంబంధించిన( సీసీటీవీ ఫుటేజీ)సైతం బయటకు రిలీజ్ చేశారు పోలీసులు. ఈ ఫుటేజీలో సోనాలీ రెడ్ క్రాప్ టాప్, బ్లూ షార్ట్ ధరించి పబ్‌లోకి అతికష్టం మీద కుంటూకుంటూ వెళుతుండగా, పక్కన ఉన్న ఆమె పీఏ సుధీర్ సాంగ్వాన్ పట్టుకొని పోవడం కనిపించారు.
ఆ ఆధారాలతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్ టీం వీళ్లిద్దరినీ పలు ప్రాంతాల్లోకి తీసుకెళ్లి.. కేసు దర్యాప్తు కొనసాగిస్తోంది. అలాగే త్వరలో వీళ్లిద్దరినీ కోర్టులో ప్రవేశపెడతామని గోవా పోలీసులు చెప్తున్నారు.
This is CCTV footage allegedly of Sonali Phogat with Sudhir Sangwan of August 22. She can barely walk. Drunk or God knows what they drugs they gave her 😑 #SonaliDeathMystery#SonaliPhogat pic.twitter.com/gj5JDCW4bL
— Rosy (@rose_k01) August 26, 2022
అయితే ఆమెను ఎందుకు చంపారనే కారణాన్ని మాత్రం నిందితులు ఇంకా వెల్లడించలేదని గోవా పోలీసులు చెప్తుండడం గమనార్హం. అయితే ఆర్థిక కారణాలే కారణం అయ్యి ఉంటాయని భావిస్తున్నారు పోలీసులు.