telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

పోక్సో చట్టంలో .. మార్పులు.. ఇంకా కఠిన శిక్షలు..

pocso act doesnot effect still rapes

మహిళలపట్లే అనుకుంటే అభంశుభం తెలియని చిన్నారులను కూడా చితికి సాగనంపుతున్న రాక్షసమూకలకు చెక్ పెట్టేందుకు తెచ్చిన పోక్సో చట్టం కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. దీనితో అనులో కొన్ని మార్పులు చేస్తూ.. చిన్నారులపై తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు పోక్సో (పొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టాన్ని పటిష్ఠం చేస్తూ పలు సవరణలను ఆమోదించింది.

చైల్డ్ పోర్నోగ్రఫీ కట్టడికి జరిమానాలు, జైలు శిక్షలు విధించేలా పోక్సో చట్టం-2012 లోని పలు సెక్షన్లకు సవరణలు చేశామన్నది. చిన్నారులపై తీవ్రమైన లైంగిక నేరాలకు పాల్పడితే మరణశిక్ష సహా కఠిన శిక్షలు విధించేలా 4,5,6 సెక్షన్లలో సవరణలు చేశామన్నది. ప్రకృతి విపత్తుల వేళ హార్మోన్లు/ రసాయనాలతో చిన్నారులకు త్వరగా సెక్సువల్ మెచ్యూరిటీ వచ్చేలా చేసే నేరాల నియంత్రణకు సెక్షన్ 9… చైల్డ్ పోర్నోగ్రఫీ సామగ్రి ధ్వంసం/డిలీట్ చేయకుండా, రిపోర్ట్ చేయకుండా ఉంటే జరిమానాలు/ జైలు శిక్షలకు 14,15 సెక్షన్లను సవరించామన్నది.

Related posts