అనుష్క శెట్టి, మాధవన్, సుబ్బరాజు, షాలిని పాండే, అంజలి ప్రధాన పాత్రలు పోషించిన మిస్టరీ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. అయితే, ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల అభిమానులతో ముచ్చటించిన మాధవన్‌కి నిశ్శబ్దం గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. అందులో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మాధవన్ సారీ చెప్పారు. నిశ్శబ్దంలో ఫ్లాష్‌బ్యాక్ అంతగా మెప్పించలేదు. మీరు ఏమంటారు ? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. నేను అందుకు సారీ మాత్రమే చెప్పగలను అని కామెంట్ పెట్టారు. ఇక మరో నెటిజన్.. నిశ్శబ్దానికి మీరు ఎలా ఓకే చెప్పావు. కథ నీకు నచ్చిందా..? లేక మీకు చేయాలనిపించి చేశారా..? ఈ మూవీ అంత గొప్పగా ఏం లేదు. ఏ కోణంలో మీరు ఈ మూవీ చేశారనుకోవచ్చు..? అని ప్రశ్నించాడు. దానికి స్పందించిన నటుడు.. ఒక్కోసారి మనం గెలుస్తూ ఉంటాము, ఒక్కోసారి ఓడిపోతాం. ఏదైనా మనం మన బెస్ట్‌ని ఇవ్వాలి అని కామెంట్ పెట్టారు.
Well you win some . You lose some .. what can I say.. we try to do our very best. 🙏🙏🙏 #AskMaddy #NishabdhamOnPrime https://t.co/QXcVvSoYac
— Ranganathan Madhavan (@ActorMadhavan) October 9, 2020