పుల్వామా దాడి ఇంకా మరిచిపోకముందే మరోసారి ఉగ్రమూక భారత్ పై దాడికి సిద్ధం అయినట్టు సమాచారం తో రక్షణ రంగం అలెర్ట్ అయ్యింది. భారత్ – పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న సమయంలో మరోపక్క ఉగ్రవాదులు దేశంలో అలజడి, విధ్వంసం సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాలను వారు టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. దేశ రాజధాని ఢిల్లీ ని వీరు టార్గెట్ చేసినట్లు సమాచారం అందడం తో ఆర్మీ అధికారులు , పోలీసులు తనిఖీలు చేయడం మొదలు పెట్టారు.
ఉగ్రవాదులు ఢిల్లీలోని 29 ప్రాంతాలలో దాడులు చేసేందుకు కుట్ర పన్నినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి. ప్రదానంగా మెట్రో స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం అందడం తో అనేక మెట్రో స్టేషన్లలో తనిఖీలు చేపట్టారు. కన్నాట్ ప్లేస్, కరోల్ బాగ్, సరోజ్ నగర్, సదర్ బజార్ మెట్రో స్టేషన్లలో భద్రతా బలగాలు అణువణువూ తనిఖీ చేస్తున్నాయి. బాంబ్ స్వ్కాడ్స్‌ను కూడా రంగంలోకి దించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నారు.