*మంత్రి పదవి ఆశించడం తప్పా..?
*కేబినేట్‌లో చోటు దక్కకపోవడంతో కన్నీటి పర్యంతమైన కోటంరెడ్డి
*పార్టీకోసం పనిచేశాం..మాకు బాధ ఉంది..
*అసంతృప్తి అయినా జగన్ కోసం పనిచేస్తా..
ఇ*క మీదట కూడా జగన్ కోసం సైనికుడిలా పని చేస్తా..
*కడుపు మండిపోతుంది నాకు..
*కడుపులో ఒకటి ..బయటి ఒకటి మాట్లాడం నాకు చేతకాదు..
ఏపీ కొత్త కేబినెట్ ఫైనల్ లిస్ట్ విడుదల అయింది . కొత్త మంత్రి వర్గంలో చోటుదక్కకపోవడంతో వైసీపీలో అసమ్మతి స్వరాలు మొదలయ్యాయి.
లిస్టులో తన పేరు లేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి పదవి ఆశించడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.
కాకాణిని వైసీపీలోకి తీసుకొచ్చింది ఎవరో తెలుసుకోవాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వైసీపీలో ముందు నుంచి తనకు ప్రాధాన్యతలేదని కోటంరెట్టి అసహనం వ్యక్తం చేశారు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించలేదని సన్నిహితుల ఆవేదన చెందారు.
అయినా సీఎం జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. పార్టీ గెలుపు కోసం కృష్టి చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. రేపటి నుంచి నియోజకవర్గంలో తలపెట్టిన గడపగడపకు ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఆయన వాయిదా వేశారు.


బస్తా సిమెంట్ కన్నా ఇసుక ధర ఎక్కువ..ఇది జగన్నాటకమే: చంద్రబాబు