telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రయాణంలో అచ్చెన్నకు రక్తస్రావం జరిగింది: చంద్రబాబు

tdp chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు గుంటూరు జీజీహెచ్ కు వచ్చారు. అయితే ఆయనను ఆసుపత్రిలోకి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. అయితే అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి గురించి జీజీహెచ్ సూపరింటిండెంట్ సుధాకర్ తో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి ఎంతో బాధాకరం అనిపించిందని వెల్లడించారు.

పైల్స్ ఆపరేషన్ జరిగిన తర్వాత రోజే 15 గంటలు ప్రయాణం చేయాల్సిరావడం దారుణమని అన్నారు. సాధారణంగా పైల్స్ ఆపరేషన్ తర్వాత వారం రోజుల విశ్రాంతి అవసరమని తెలిపారు. మందులు తీసుకుంటానని చెప్పినా అధికారులు అంగీకరించకపోవడం విచారకరమని అన్నారు. ప్రయాణంలో అచ్చెన్నకు రక్తస్రావం జరిగిందని, ఈ విషయం మీడియా వాళ్లు కూడా చూసుంటారని వివరించారు.

డాక్టర్లను అడిగితే కొన్నిచోట్ల రక్తం గడ్డకట్టిందని, అది చీముగా మారే అవకాశముందని చెప్పారు. నిన్న జరిగిన పరిణామాలు అత్యంత బాధాకరం. 300 మంది పోలీసులను అచ్చెన్న కోసం మోహరించారు. ఓ టెర్రరిస్టుపై దాడి చేసినట్టుగా ఇంటి గోడలు దూకి మరీ వెళ్లారు. తనకు పైల్స్ ఆపరేషన్ జరిగిందని అచ్చెన్న నిజం చెబుతున్నా వినిపించుకోలేదని చెప్పారు.

Related posts