telugu navyamedia
సినిమా వార్తలు

బాలకృష్ణ ,అనిల్​రావిపూడి NBK 108 సినిమా..

నందమూరి బాలకృష్ణ నటించనున్న 108వ సినిమా ఇప్పటికే ఖరారైంది. దీనికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు. హైఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రం గురించి తాజాగా తొలి అప్డేట్ ఇచ్చారు మేకర్స్​.​ ఓ స్పెషల్ గ్లింప్స్​ను రిలీజ్​ చేస్తూ సినిమాను అధికారికంగా ప్రకటించారు. షైన్​ స్క్రీన్​ ఈ మూవీ నిర్మించనుంది.

బాలయ్యను ఎప్పుడూ చూడని విధంగా చూపించనున్నట్లు ఈ వీడియోలో తెలిపారు. వీడియో ఇంట్రో బీజేఎం​ అదిరిపోయింది. తమన్​ స్వరాలు సమకూర్చనున్నారు.

కాగా ఇందులో బాలయ్య ఐదు పదుల వయసున్న తండ్రిగా కనిపించనున్నారట. ఆయన కూతురు పాత్రను శ్రీలీల పోషించనుందని తెలిసింది. మరో కీలక పాత్ర కోసం బాలీవుడ్‌ భామ సోనాక్షి సిన్హాను సంప్రదిస్తున్నట్లు సమాచారం.

ఇక బాలయ్య ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్​టైనర్​ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.బాలయ్య సరసన శ్రుతిహాసన్​ హీరోయిన్​గా నటిస్తుండగా.. తమన్​ బాణీలు అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో మరో లేడీ పవర్​ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్‌ కనిపించనున్నారు.

Related posts