telugu navyamedia
రాజకీయ

స్పైస్‌జెట్‌ విమానంలో సిగరెట్‌ తాగుతూ సెల్ఫీ వీడియో..డీజీసీఏ సీరియస్​

నిబంధనలు అతిక్రమిస్తూ ఓ ప్ర‌యాణికుడు స్పైస్‌జెట్‌ విమానంలో సీట్లలో పడుకొని లైటర్‌తో సిగరెట్‌ వెలిగించుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకొని దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్ అవుతోంది.

గురుగ్రామ్‌కు చెందిన బల్విందర్‌ కటారియా అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు. అతడికి ఇన్‌స్టాలో దాదాపు 6లక్షలకుపైగా ఫాలోవర్స్‌ కూడా ఉన్నారు. కొన్నాళ్ల క్రితం దుబాయ్‌ నుంచి న్యూఢిల్లీకి వచ్చే స్పైస్‌జెట్‌ విమానంలో ప్రయాణించిన ఆయన.. సీట్లలో పడుకొని సిగరెట్‌ అంటించాడు. పొగతాగుతున్న దృశ్యాలను సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆగ్రహంతో ఊగిపోయారు. ఇలా చేయడం వల్ల వందల మంది ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందంటూ మండిపడ్డారు.

పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, డీజీసీఏతోపాటు పౌరవిమానయాన భద్రతను పర్యవేక్షించే సీఐఎస్‌ఎఫ్‌ ట్విటర్‌ హ్యాండిల్‌లకు ట్యాగ్‌ చేయడం జ‌రిగింది

దీనిపై స్పందించిన సింథియా ఘటనపై దర్యాప్తు చేపట్టామని, అలా ప్రమాదకరంగా ప్రవర్తించేవారిని ఎట్టిపరిస్థితుల్లోను వదిలేది లేదని ట్వీట్‌ చేశారు.

ఇదిలాఉంటే, పొగ వల్ల క్యాబిన్‌లో పొంచివున్న ముప్పు, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగడం వంటి కారణాల దృష్ట్యా విమానం లోపల పొగత్రాగడంపై నిషేధం ఉంది.

Related posts