సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆయనకు ఇప్పుడు కీలక పదవి దక్కింది. వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత ఆదేశాల మేరకు జూనియర్ మామకు పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యునిగా నియమించడం జరిగింది. ఈ విషయాన్ని వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తనయుడు దగ్గుబాటి హితేష్ కూడా వై సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 28న జూనియర్ మామ వైసీపీ కండువా కప్పుకున్న విషయం విదితమే. ఈసారి ఎన్నికల్లో వైఎస్ జగన్‌ని ఎలాగైనా గెలిపించుకోవాలని పార్టీలో చేరిన సందర్భంగా నార్నె శ్రీనివాసరావు అన్నారు.
previous post
next post
పార్టీ ఫిరాయింపులు కేసీఆర్ కు ‘కిక్’ ఇస్తున్నాయి: రేవంత్ రెడ్డి