telugu navyamedia
రాజకీయ వార్తలు

సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలి: నిర్మలా సీతారామన్

Nirmalasitaraman

 ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీకి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆఖరి ప్రకటన చేశారు. పలు రంగాలకు సంబంధించిన కేటాయింపుల వివరాలు వెల్లడించారు. సంక్షోభం తలెత్తింది వాస్తవమేనని, అయితే, సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలని ఆమె వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారని చెప్పారు. అవసరార్థులకు నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేశామని అన్నారు. భవన నిర్మాణాల రంగానికి సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో రూ.3,955 కోట్లు జమచేశామని తెలిపారు. 12 లక్షల మంది ఈపీఎఫ్‌వో ఖాతాదారులు రూ.3,600 కోట్ల నగదు వెనక్కి తీసుకున్నారని చెప్పారు.మూడు నెలల పాటు పేదలకు ఉజ్వల పథకం కింద సిలిండర్లు అందజేస్తున్నామని చెప్పారు.

జన్‌ధన్‌కు సంబంధించి రూ.20 కోట్ల ఖాతాల్లో రూ.10 వేల కోట్లు జమ చేశామన్నారు. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని మోదీ మొదటి నుంచీ చెబుతున్నారని తెలిపారు. భూమి, శ్రమ, చట్టాలు ఈ మూడింట్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. గరీబ్ కల్యాణ్ యోజన కింద పేదలకు ఆహారధాన్యాలు, పప్పు దినుసులు అందిస్తున్నామని చెప్పారు. గరీబ్‌ కల్యాణ్ యోజనలో భాగంగా వివిధ వర్గాలకు డీబీటీతో నగదు బదిలీ చేశామని చెప్పారు. సాంకేతిక పరమైన సంస్కరణలు జరగకపోయి ఉంటే అది సాధ్యమయ్యేది కాదని వివరించారు.

Related posts