ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఎనికల ముందు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు శేఖర్‌రెడ్డికి పోలీసులు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు నిందితుడు శేఖర్‌రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వివేకా హత్య కేసులో శేఖర్‌రెడ్డిని పోలీసులు నిన్న అదుపులోకి తీసుకున్నారు. కేసులో నిజాలు నిగ్గు తేల్చడానికి నార్కోఅనాలసిస్ పరీక్షలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇవాళ సాయంత్రం నార్కో అనాలసిస్ పరీక్షలపై కోర్టు నిర్ణయం వెలువరించనుంది. కాగా నిన్న వాచ్‌మెన్ రంగన్నకు నార్కో అనాలసిస్ పరీక్షలకు అనుమతినిస్తూ పులివెందుల కోర్టు తీర్పును వెలువరించిన విషయం విధితమే.
ఎస్సీ వర్గీకరణపై ఏపీలో జగన్ వైఖరి తెలపాలి: మాజీ ఎంపీ హర్షకుమార్