telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది: నారా లోకేశ్

Nara Lokesh

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. ప్రజలకు రక్షణ కరువైందని లోకేశ్ పేర్కొన్నారు. గ్రామాల్లో వైసీపీ గూండాలు దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని దుయ్యబట్టారు.

గుంటూరు జిల్లా కొల్లిపెర మండలం వల్లభాపురంలో దిలీప్ రెడ్డి అనే యువకుడి ఇంటికెళ్లి వైసీపీ శ్రేణులు కర్రలతో దాడి చేశాయని చెప్పారు. అడ్డుకోబోయిన దిలీప్ రెడ్డి తండ్రి, బాబాయ్ లపై కూడా కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారని తెలిపారు. దిలీప్ రెడ్డి కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Related posts