telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వి” ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆన్లైన్ లోనే…!

V

ఇంద్రగంటి మోహన్‌ కృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్‌ బాబు కలిసి నటిస్తున్న చిత్రం ‘వి’. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. నివేద థామస్, అదితిరావ్ హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతం అందించారు. పీ.జీ విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఈ సినిమాని మార్చి 25న ఉగాది కానుకగా రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించారు. అయితే కరోనా ప్రభావం థియేటర్స్ క్లోజ్ అవడం వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ సినిమాను ఓటీటీ లో ఈ చిత్రాన్ని భారతదేశంతో 200 దేశాలు మరియు టెర్రిటోరియాస్‌లో ఉన్న ప్రైమ్ సభ్యులు సెప్టెంబర్ 5న డిజిటల్ ప్రీమియర్‌ను వీక్షించవచ్చని చిత్రయూనిట్ అధికారికంగా తెలియజేసింది. ఇటీవల విడుదలైన యాక్షన్ ప్యాకెడ్ ”వి” ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ వైరస్ కారణంగా సినిమా విడుదలకు ముందు నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆన్లైన్ లోనే నిర్వహిస్తుంది చిత్రబృందం. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది. సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ జరగనున్నట్లు తెలిపారు.ఇందులో నాని, సుధీర్ బాబు, హీరోయిన్లు నివేదా థామస్, అదితి రావు అలాగే దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ పాల్గొననున్నారు.

Related posts