టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టడం పై నందమూరి కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టారు. రాజకీయాలతో సంబంధం లేని మహిళపై.. ఈ రకమైక కామెంట్స్ చేయడం బాధకరమని అని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నందమూరి రామకృష్ణ ఎమోషనల్ అయ్యారు. దేవాలయం లాంటి నందమూరి ఫ్యామిలీకి ఇలాంటివి మాట్లాడడం చాలా బాధగా ఉందన్నారు. తమ కుటుంబం జోలికి ఎవరొచ్చినా వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు.
ఇలాంటి పరిణామం ఏ కుటుంబానికి జరగకూడదనని బాధపడ్డారు. ద్వారంపూడి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు హద్దులు మీరారని.. వారు భవిష్యత్ గురించి ఆలోచించుకోని మాట్లాడాలన్నారు. మీ ఇళ్లలో ఆడవాళ్లు ఏమనుకుంటున్నారో వెనక్కి తిరిగి చూసుకోండి అంటూ ఫైరయ్యారు నందమూరి రామకృష్ణ.
రాజకీయంగా ఉంటే… రాజకీయంగానే చూసుకోవాలని.. కానీ వ్యక్తిగతంగా మాట్లడం మేము ఎప్పడూ చూడలేదు వినలేదని అన్నారు. తామేం గాజులు తొడుక్కుని కూర్చోలేదని.. ఎన్టీఆర్, టీడీపీ క్రమశిక్షణ మాత్రమే నేర్పిందని పేర్కొన్నారు. తమ సహనాన్ని పరీక్షించొద్దని నందమూరి రామకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై వైసీపీ హద్దు మీరితే… తామూ హద్దు మీరుతామని స్పష్టం చేశారు. ఇటువంటి సంఘటనలు మరోసారి జరగకూడదని అందరికీ కోరుతున్నానని అన్నారు.