telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కరోనా ఫోర్త్ వేవ్ టెన్షన్.. జూన్ రెండో వారంలో ఉధృతి

ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్రలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫోర్త వేవ్ రూపంలో కొత్త వేరియంట్ ముంచుకొస్తోంది.
కరోనా వైరస్ మరోమారు ఆందోళన రేపుతోంది. మే నెల తర్వాత తెలంగాణలోనూ వేల సంఖ్యలో కేసు ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మళ్లీ టెన్షన్ పెడుతోంది.జూన్ రెండో వారం నాటికి కరోనా ఉధృతి పెరిగే అవకాశముందని భావిస్తోంది.

కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
తెలంగాణలోనూ కరోనా ఫోర్త్ వేవ్ వ్యాప్తి చెందే అవకాశమున్నట్లు ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది.
కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది.

జూన్ రెండో వారం నాటికి 2,500 నుంచి 3 వేల కేసులు నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
కరోనా పాజిటివిటీ రేటు గత వారంతో పోలిస్తే రెట్టింపయింది. గత వారం 0.15 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ఈ వారం 0.30గా నమోదైంది. బయటికి వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం.. వ్యాక్సిన్లు వేయించుకోని వారు వెంటనే వేయించుకోవాలని సూచించింది.

కరోనా ఫోర్త్ వేవ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే 94 శాతం మందిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని.. ఇటీవల నిర్వహించిన సర్వేల్లో ఆ విషయం తేలిందన్నారు.

Related posts